Share News

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: డీఈవో

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:44 AM

జిల్లాలో పది పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యమని జిల్లా డీఈవో సుధాకర్‌రెడ్డి చెప్పారు.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: డీఈవో

చాగలమర్రి, ఫిబ్రవరి 1: జిల్లాలో పది పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యమని జిల్లా డీఈవో సుధాకర్‌రెడ్డి చెప్పారు. గురువా రం చాగలమర్రి బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల గ్రేడిం గ్‌ను అడిగి తెలుసుకున్నారు. అటల్‌ టింకర్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. ల్యాబ్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత టీచర్‌ను ఆదేశించారు. ఐఎఫ్‌పీఎస్‌ డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు డిజిటల్‌ బోధన కొనసాగిం చాలని సూచించారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఏర్పాటు చేశామని చెప్పారు. మద్దూరు, పెద్దబోదనం పాఠశాలలో డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేయడంలో అలసత్వం తగదన్నారు. ఈ ఏడాది జిల్లాలో 24,223 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరవుతున్నారని, వీరి కోసం 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు పకడ్బం దీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. ఆయన వెంట ఎంఈవోలు అనూరాధ, న్యామతుల్ల, ఉపాధ్యా యులు మహబూబ్‌బాషా, శంకర్‌, సీఆర్పీలు అమీర్‌ఖాన్‌, ఖాశీం ఉన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:44 AM