Share News

గృహ నిర్మాణాలను పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:52 AM

గూడూరు నగర పంచా యతీ పరిధిలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీవో సందీప్‌ కుమార్‌ అన్నారు.

గృహ నిర్మాణాలను పూర్తి చేయాలి
మాట్లాడుతున్న ఆర్డీవో సందీప్‌ కుమార్‌

గూడూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): గూడూరు నగర పంచా యతీ పరిధిలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీవో సందీప్‌ కుమార్‌ అన్నారు. గురువారం గూడూరు నగర పంచా యతీ కార్యాలయంలో గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో మాట్లాడుతూ గూడూరు నగర పంచాయతీ పరిధిలో 920 గృహాలకు గాను 801 గృహాలు పూర్తి కాగా, మిగిలిన 119 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్‌ ఈఈ ఎఎల్‌ ప్రభాకర్‌, డీఈ వాసుదేవరావు, ఏఈ జమన్న, వర్క్‌ ఇనస్పెక్టర్‌ లక్షణ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:52 AM