Share News

కార్మిక, కర్షక ద్రోహులను చరిత్ర క్షమించదు

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:09 AM

దేశంలో కార్మిక, కర్షకులను సమస్యల సుడిగుండంలోకి నెట్టిన ప్రభుత్వాధినేతలను చరిత్ర ఎన్నిటికీ క్షమించదని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఇరిగినేని పుల్లారెడ్డి విమర్శించారు.

కార్మిక, కర్షక ద్రోహులను చరిత్ర క్షమించదు
జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న నాయకులు

పీపీఎస్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఇరిగినేని పుల్లారెడ్డి

జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 44 దిగ్బంధం

కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 16: దేశంలో కార్మిక, కర్షకులను సమస్యల సుడిగుండంలోకి నెట్టిన ప్రభుత్వాధినేతలను చరిత్ర ఎన్నిటికీ క్షమించదని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఇరిగినేని పుల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇంట ర్నేషనల్‌ ఫంక్షన్‌ హాలు వద్ద బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారి 44పై అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు కిమీ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మా ట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్న రవాణా రంగంపై ఈ ప్రభుత్వాలు క్షక్షగట్టాయని విమర్శించారు. డ్రైవర్లు చిన్న తప్పు చేసినా రూ. 10 లక్షలు జరిమానా విధించి, 10 ఏళ్ళు జైలుకు పంపే చట్టాన్ని కేంద్రంలో తీసుకుని వస్తే దానికి ఎగబడి వైసీపీ, టీడీపీలు బలప రచి డ్రైవర్లను బలిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌.అన్వర్‌ బాషా, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎండీ ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఫ లాంగ్‌లారీ ఓనర్‌, డ్రైవర్‌ అసోసియేషన్‌, మోటార్‌ వర్కర్స్‌ యూ నియన్‌, సీఐటీయూ అధ్వర్యంలో రవాణారంగ బంద్‌లో భాగంగా నగర శివారులోని కార్బైట్‌ ఫ్యాక్టరీ సమీపంలోని బెంగుళూరు-హైదరాబాదు జాతీయ రహదారిపై గంటన్నరపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద ర్భంగా అసోసియేషన్‌ జిల్లా నాయకులు మిన్నల్ల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్‌ అండ్‌ రన్‌ సెక్షన్‌ 106-1-2లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఫ అఖిల భారత గ్రామీణ బంద్‌ పిలుపుమేరకు నగరంలోని ఇన్సూరెన్సు ఉద్యోగులు ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో యూని యన్‌ సెక్రటరీ సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపై వివక్షతతో కూడిన విధానాలు అమలు చేస్తుందని విమర్శించారు. నూతన పెన్షన్‌ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కర్నూలు(రూరల్‌): రైతులను దగా చేస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. కర్నూలు రూరల్‌ మండలం ఉల్చాల గ్రామంలో శుక్రవారం గ్రామీణ భారత్‌ బంద్‌ను డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతు వ్యవ సాయాన్ని కార్పొరేట్‌ శక్తు లకు దోచిపెట్టడం కోసం మోదీ తెచ్చిన వ్యవ సాయ చట్టాలను రద్దు చేసి పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకరావాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఇస్మాయిల్‌, వెంకటయ్య, లోకన్న, మద్దిలేటి, కృష్ణ, సోమేష్‌, తిమ్మప్ప, శివన్న, అబ్దుల్లా పాల్గొన్నారు.

కల్లూరు: గ్రామీణ భారత్‌బంద్‌ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ, రైతుసంఘం ఆధ్వర్యంలో కల్లూరు మండలం చిన్నటేకూరు జాతీయ రహదారిపై రాసత్రోకో నిర్వహించారు. శుక్రవారం రైతు సంఘం మండల కార్యదర్శి ఏ.క్రిష్ణ అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమానికి ఏపిరైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సీఐటీయూ మండల కార్యదర్శి కె.మధు హాజరయ్యారు. రైతులు పండించిన పంటలకు ఎస్‌పీఎం చెల్లిస్తామన్నా బీజేపీ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో నారాయణ, గోపాల్‌, మాబాషా, కేశాలు, కార్మికులు యేసురాజు, సోమేశ్వరయ్య పాల్గొన్నారు.

కోడుమూరు: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎ స్‌ఎఫ్‌ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం దేశ వ్యాప్త సమ్మెలో పాలొ ్గన్నారు. ఆయా సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. నాయకులు గఫూర్‌ మియా, వీరన్న, లక్ష్మన్న, రాజు రంగస్వామి, మధు, రాజు పాల్గొన్నారు.

గూడూరు: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిందామని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జె మోహన్‌ అన్నారు. శుక్రవారం గూడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌లో భాగంగా కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. సీఐటీయూ మండల ఉపాధ్యక్షులు రాజశేఖర్‌, రవి అధ్యక్షతన జరిగిన రాస్తారోకోలో సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జె మోహన్‌ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిన కూడా కార్మికుల, రైతుల, ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయ కులు నాగరాజు, దుబ్బన్న, భగవాన్‌ దాస్‌, హమాలీ కార్మికులు కోమ్మురాజు, అబ్రహాం, రవి, మున్సిపల్‌ కార్మికులు శాంతన్న, గుంటన్న పాల్గొన్నారు.

ఓర్వకల్లు: గ్రామీణ భారత్‌ బంద్‌ సందర్బంగా ఓర్వకల్లులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. షాపులు, తహసీల్దార్‌, ఎంపీడీవో, ఉపాధి హౌసింగ్‌, వ్యవసాయ కార్యాలయాలను బంద్‌ చేసి జాతీయ రహదారిపై అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమానికి సీఐటీయూ మండల అధ్యక్షుడు శ్రీధర్‌ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నాయకులు నాగన్న, సీపీఐ మండల కార్యదర్శి సుధాకర్‌; సీఐ టీయూ మండల కార్యదర్శి షాజహాన్‌, చంద్రబాబు నాయుడు, మధుసూ దన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 01:09 AM