Share News

హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:13 AM

ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్‌ సబ్‌ డివిజన్లలో పోలీస్‌ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్‌ వాడకంపై ఇబ్బంది అవగాహన బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ
హెల్మెట్‌ ధరించి బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా

నంద్యాల క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్‌ సబ్‌ డివిజన్లలో పోలీస్‌ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్‌ వాడకంపై ఇబ్బంది అవగాహన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రమైన నంద్యాలలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ముఖ్య అతిథిగా పాల్గొని హెల్మెట్‌ ధరించి ప్రారంభించారు. ఈ ర్యాలీ టెక్కె మార్కెట్‌ యార్డు నుంచి ప్రారంభమై సాయిబాబానగర్‌, ప్రభుత్వ ఆసత్రి, పద్మావతినగర్‌, మున్సిపల్‌ ఆఫీస్‌, సంజీవనగర్‌గేట్‌, ఆర్టీసీ బస్టాండ్‌, శ్రీనివాససెంటర్‌, గాంధీచౌక్‌మీదుగా తిరిగి టెక్కె మార్కెట్‌యార్డుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్‌ ధరించడంవల్ల అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:13 AM