Share News

కర్నూలు నగరంలో జోరు వాన

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:03 AM

వరుసగా కురుస్తున్న వానకు కర్నూలు, కల్లూరు నగరంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి.

కర్నూలు నగరంలో జోరు వాన
ఆర్‌ఎస్‌ రోడ్డులో నిలిచిన వర్షం నీరు

లోతట్టు కాలనీలు జలమయం

ఇబ్బందులు పడిన ప్రజలు

కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 8: వరుసగా కురుస్తున్న వానకు కర్నూలు, కల్లూరు నగరంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. అశోక్‌నగర్‌, డీమార్టు ఏరియా, కొత్తబస్టాండుకు వెళ్లే కేసీ కెనాల్‌ బ్రిడ్జి కింద, కల్లూరులో బ్రిడ్జి ప్రాంతంతోపాటు లోతట్టు కాలనీల్లో నీటి నిల్వ చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెత్తా చెదారం కాలువల్లో పేరుకుపోవడంతో లోతట్టు కాలనీల్లోని మురు గునీరు బయటకు పోయే దారి లేక రోడ్లపై ఏరులై పారు తోంది. దీంతో ఆయా కాలనీల్లోని ప్రజలు దుర్వాసన భరించలేక దోమల బెడదతో రోగా లపాలయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు రాబో యే వర్షాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే యుద్ధప్రాతిపదికన కాలువలను శుభ్రం చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు

Updated Date - Jun 09 , 2024 | 12:03 AM