Share News

కోడుమూరులో భారీ వర్షం

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:36 AM

మండలంలో భారీ వర్షం కురిసింది.

కోడుమూరులో భారీ వర్షం
గూడూరు మండలం పెంచికలపాడు దగ్గర బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద నీరు

కోడుమూరు(రూరల్‌), జూన్‌ 3: మండలంలో భారీ వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తల్లడిల్లారు. వర్షం పడడ ంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆదివారం రాత్రి నుంచే గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. భారీవర్షం పడ డంతో పొలాలు పదునెక్కాయి. చెక్‌డ్యాంలకు జలకళ సంతరిం చుకుంది. నైరుతి ఆగమనంలోనే వర్షం రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. విత్తు పనులకు అనుకూలంగా మారిందని అన్నారు. గోరంట్ల గ్రామంలోని జగనన్న కాలనీలో వర్షపునీరు నిలిచింది. దీంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురయ్యారు. మండలంలో 43.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

గూడూరు: గూడూరులో భారీ వర్షం కురిసింది. ఆదివారం ఒంటి గంట ప్రాంతం నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం కురిసింది. కురిసిన వర్షానికి ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. గూడూరు మండలంలో 45.6 ఎం.ఎం. వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఈ వర్షానికి వంకలు, వాగులు పోంగి పోర్లాయి. మండలంలోని పెంచికలపాడు దగ్గర ఉన్న బ్రిడ్జిపైకి వరద నీరు చేరి ప్రవహించింది. దీంతో గంట పాటు ఎక్కడి వాహ నాలు అక్కడే నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే జూన్‌ మొదటి వారంలోనే వర్షం కురవడం పట్ల విత్తనాలు వేసేందుకు అనువుగా ఉంటుందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:36 AM