Share News

భారీగా ఉల్లి దిగుబడులు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:03 AM

కర్నూలు వ్యయసాయ మార్కెట్‌కు గురువారం ఉల్లి దిగుబడులు పోటెత్తాయి.

భారీగా ఉల్లి దిగుబడులు
బారులుదీరిన ఉల్లిగడ్డల వాహనాలు

కర్నూలు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు వ్యయసాయ మార్కెట్‌కు గురువారం ఉల్లి దిగుబడులు పోటెత్తాయి. ఉమ్మడి కర్నూలుతో పాటు సరిహద్దు జిల్లాలు, కర్ణాటక నుంచి రైతులు ఉల్లి దిగుబడులు భారీ ఎత్తున తీసుకొస్తున్నారు. మార్కెట్‌ యార్డు మెయిన్‌ గేట్‌ వద్ద వివరాలు నమోదు చేసిన తరువాతే మార్కెట్‌లోకి అనుమతి ఇస్తున్నారు. ఈ ప్రక్రియ జాప్యం అవుతోంది. దీనికి తోడు ఇప్పటికే మార్కెట్‌లో దిగుబడి భారీగా ఉంది. ఈ కారణంగా ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి మార్కెట్‌ ముందున్న అశోక్‌ నగర్‌ రోడ్డుపై వరకు ఉల్లి ట్రాక్టర్లు, లారీలు, ఎద్దుబండ్లు బారులుదీరాయి. కర్నూలు జిల్లాలో దాదాపు 25 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. ఎక్కువ రోజులు పొలంలో ఉంచితే పంట కుళ్లిపోతుంది. ఆలస్యమైతే ధర పతనమవుతుంది. ఈ భయంతో రైతులు భారీగా ఉల్లి తీసుకొస్తున్నారు. గురువారం కర్నూలు మార్కెట్‌కు 43,803 బస్తాల (19,711 క్వింటాళ్లు) దిగుబడులు వచ్చాయి. క్వింటా కనిష్ఠ ధర రూ.444, గరిష్ఠంగా రూ.4,639, మధ్యస్థంగా రూ.3,888 పలికింది.

Updated Date - Oct 25 , 2024 | 12:03 AM