Share News

హెల్త్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:06 AM

కాంట్రాక్టు పద్ధతిలో 22 ఏళ్లుగా పని చేస్తున్న తమను ఇటీవల తొలగించారని, ప్రభుత్వం తిరిగి విధుల్లో తీసుకోవాలని హెల్త్‌ అసిస్టెంట్లు కోరారు.

హెల్త్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి
నిరసన తెలుపుతున్న హెల్త్‌ అసిస్టెంట్లు

కర్నూలు హాస్పిటల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు పద్ధతిలో 22 ఏళ్లుగా పని చేస్తున్న తమను ఇటీవల తొలగించారని, ప్రభుత్వం తిరిగి విధుల్లో తీసుకోవాలని హెల్త్‌ అసిస్టెంట్లు కోరారు. శుక్రవారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు వారు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హెల్త్‌ అసిస్టెంట్లు ఆర్‌బీ ప్రభాకర్‌, రామకృష్ణ, ఎండీ హుశేన, జయరాముడు, రంగన్న, నాగరాజు, కరుణాకర్‌, సురేష్‌ మాట్లా డుతూ తమను విధుల నుంచి తొలగించడంతో భవిష్యత్తు ఆగమ్యగోచ రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు అప్పీలుకు వెళ్లామన్నారు. హెల్త్‌ అసిస్టెంట్లును తెలంగా ణలో కొనసాగిస్తున్నారని, ఏపీలో తొలగించడం అన్యాయమన్నారు. సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తో కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడి తమను విధుల్లో తీసుకునేలా చూడాలని వారు కోరారు.

Updated Date - Dec 28 , 2024 | 01:06 AM