ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ABN , Publish Date - Jan 02 , 2024 | 01:15 AM
జిల్లా పరిషత్ ఆవరణలోని సీఈఓ జి.నాసరరెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనం గా జరిగాయి.
కర్నూలు(న్యూసిటీ), జనవరి 1: జిల్లా పరిషత్ ఆవరణలోని సీఈఓ జి.నాసరరెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనం గా జరిగాయి. జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డికి డిప్యూటీ సీఈఓ వెంక టసుబ్బారెడ్డి, డీఎల్‌పీఓ తిమ్మక్క, ఎంపీడీఓలు, జడ్పీ పరిపాలన అధికా రులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
ఫ నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ భార్గవతేజ నివాసం లో అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, ఎస్‌ఈ వేణుగోపాల్, ఈఈ శేషసాయి, మెడికల్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వరరెడ్డి, రెవెన్యూ అధికారి జునైద్, డిప్యూటి సిటి ప్లానర్ మోహన్‌కుమార్, మేనేజర్ చిన్నరాముడు, డీఈ,ఏ ఈలు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఫ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఎంపీ సంజీవ్‌కుమార్‌కు పలువురు అధికారులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఫ రాయల్ ఫంక్షన్ హలులో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు పలు వురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, వివిద శాఖల అధికారులు, ఉద్యోగులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఫ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నివాసం వద్ద నూతన సంవ త్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిద ప్రభుత్వ శాఖల అధికా రులు, ప్రైవేటు సంస్థల యజమానులతో పాటు పాటు కార్పొరేట ర్లు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
ఫ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏపీ రైతు సంఘం నాయకులు కలెక్టర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డీఆర్‌ఓ మధుసూదన్, ఆర్డీఓ హరిప్రసాద్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వరలక్ష్మి, కేడీసీసీ సీఈఓ రామాంజనేయులతో పాటు కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు తహసీల్దార్లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామక్రిష్ణ, ఆంజనేయులు, నాగన్నా, కృష్ణ పాల్గొన్నారు.
ఓర్వకల్లు: నూతన సంవత్సర-2024 వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మాజీ ఎమ్మెల్యే పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేకర్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మల్లికా ర్జున రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డిలను పూలమాలలతో ఘనం గా సన్మానించారు. ఓర్వకల్లులో టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, హుశేనాపురంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్.మహబూబ్‌బాషా కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు.
కల్లూరు: నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరి ఇంట్లో సుఖఃసం తోషాలు నిండాలని టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత, టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి ఆకాంక్షించారు. గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డికి పూలబొకేలు, శాలువాలు, మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు అర్బన్, రూరల్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కర్నూలు(రూరల్): కర్నూలు నగరంలోని నెహ్రూనగర్ యందు టీడీపీ సీనియర్ నేత ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటి వద్ద కోడుమూరు నియో జకవర్గ టీడీపీ యువనాయకులు బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన గూడూరు, బెళగల్, కోడుమూరు, కర్నూలు రూరల్ మండలాల నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి సోమవారం న్యూఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అందరు కలిసి కేక్‌ను కట్ చేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో విష్ణువర్గీయులు దిన్నెదేవరపాడు సర్పంచు మాధవస్వామి, చందు, గిరిమోహన్, శంకర్, పూడూరు భాష, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోడుమూరు(రూరల్): మండలంలోని గ్రామాల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యకర్తలు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అమడగుంట్ల వెంకటేశ్వర్లు, సుంకన్న, రాజు, మాదన్న, అనంతులు అనుగొండ పద్మనాభరెడ్డి, బంకు గిడ్డయ్య ప్యాలకుర్తి వెంకటేశ్వర్లు యాదవ్, రాఘవేంద్రయాదవ్, రాజశేఖర్‌యాదవ్ ఉన్నారు.