Share News

వైభవంగా హనుమాన్‌ శోభయాత్ర

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:46 AM

స్థానిక బాల ఆంజనేయ స్వామి దేవాల యంలో హను మాన్‌ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ శాఖల ఆధ్వర్యంలో బుధవార ఉదయం వీర హనుమాన్‌ విజయ శోభయాత్ర నిర్వహించారు.

వైభవంగా హనుమాన్‌ శోభయాత్ర
హొళగుందలో హనుమాన్‌ శోభయాత్రలో పాల్గొన్న భక్తులు

హొళగుంద, ఏప్రిల్‌ 24: స్థానిక బాల ఆంజనేయ స్వామి దేవాల యంలో హను మాన్‌ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ శాఖల ఆధ్వర్యంలో బుధవార ఉదయం వీర హనుమాన్‌ విజయ శోభయాత్ర నిర్వహించారు. హనుమంతుడి భారీ విగ్రహ మూర్తిని ట్రాక్టరపై ఉంచి జై శ్రీరామ్‌ అంటూ ఊరేగించారు. యువకులు, ప్రజలు స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలూరు సీఐ వెంకటేశ్వర్లు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Apr 25 , 2024 | 12:46 AM