Share News

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలి

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:39 AM

కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను అన్ని రాజకీయ పార్టీలు తప్పక పాటించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలకో్ట్రలర్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(ఈఆర్‌ఓ), మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.భార్గవ తేజ అన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలి

కర్నూలు(కల్చరల్‌), మార్చి 17: కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను అన్ని రాజకీయ పార్టీలు తప్పక పాటించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలకో్ట్రలర్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(ఈఆర్‌ఓ), మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.భార్గవ తేజ అన్నారు. ఆదివారం సాయంత్రం కార్పొరేషన్‌ కార్యాలయంలోని పాత కౌన్సిల్‌ హాలులో అన్ని రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. కాన్వాసింగ్‌, ప్రచార వాహనాలు, లౌడ్‌ స్పీకర్‌, తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని తెరవడం, కరపత్రాల పంపిణీ, వీడియో వ్యాన్‌, లౌడ్‌ స్పీకర్లతో సమావేశం నిర్వహిం చడం, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌, ఊరేగింపు, ర్యాలీ, పోస్టర్‌, హోర్డింగ్‌, బ్యానర్‌ జెండాలను ప్రదర్శించడం, వాటికి అనుమతి కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్‌ చేసుకోవాలో అవగాహన కల్పించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కచ్చితంగా అనుమతి పొందిన ప్రచార సాధనాలనే ఉపయోగించా లని అన్నారు. సమావేశంలో కార్పొరేషన్‌ ఆదనపు కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఏఆర్‌ఓ, కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ మోహన్‌కు మార్‌, టౌన్‌ప్లానింగ్‌ ఇన్‌చార్జి డీసీపీ సంధ్య, ఏసీపీ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ నోడల్‌ అధికారి రంగస్వామి పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:39 AM