Share News

‘గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్‌ రామ్‌’

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:42 PM

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ అని కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.

‘గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్‌ రామ్‌’

నంద్యాల (కల్చరల్‌), ఏప్రిల్‌ 5: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ అని కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జగ్జీవన్‌ రామ్‌ 117వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భాన్ని ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌ రామ్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఆయన నడిచిన బాట, చూపిన సంస్కరణలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి దిలీప్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:42 PM