Share News

శ్రీశైలంలో గోపూజ

ABN , Publish Date - Aug 27 , 2024 | 12:12 AM

శ్రీశైలం మహాక్షేత్రంలో సోమవారం కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం, దేవస్థానం గో సంరక్షణశాలలోని గోవులకు, గోవత్సాలకు విశేషంగా పూజాధికాలు నిర్వహించారు.

శ్రీశైలంలో గోపూజ
గోపూజలో పాల్గొన్న ఈవో దంపతులు

శ్రీశైలం, ఆగస్టు 26: శ్రీశైలం మహాక్షేత్రంలో సోమవారం కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం, దేవస్థానం గో సంరక్షణశాలలోని గోవులకు, గోవత్సాలకు విశేషంగా పూజాధికాలు నిర్వహించారు. కార్యక్రమంలో లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ అర్చకులు, వేదపండితులు పూజాసంకల్పాన్ని పఠించారు. అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తరమంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాధికాలు జరిపి గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. తరు వాత దేవస్థానం గో సంరక్షణశాలలోని కృష్ణునికి విశేష పూజలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు దంపతులు, సహాయ కార్యనిర్వహణాధికారి మోహన్‌, పర్యవేక్షకులు స్వర్ణలత, అర్చకులు, వేదపండితులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 12:12 AM