ప్రజలకు మంచి రోజులు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:15 AM
ప్రజలకు మంచి రోజులు వచ్చాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

మహానంది, జూలై 4: ప్రజలకు మంచి రోజులు వచ్చాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బుడ్డా తన సతీమణి శైలజతో కలిసి గురువారం మహానందీశ్వరుడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం ముఖద్వారం వద్ద ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక అభిషేకార్చన పూజలను జరిపారు. ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో వేదపండితులు ఆశీర్వదించి ప్రసాదాలు అందచేశారు. ఈవో వీరిని శాలువా సన్మానించి, స్వామివారి మెమెంటో బహూకరించారు. ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రాక్షసపాలన నుంచి విముక్తి కలిగిందని అన్నారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకే నియోజిక వర్గంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. అనంతరం దేవస్ధానం ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సన్మానించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామలింగారెడ్డి, ఎంపీపీ యశస్వీనిరెడ్డి, గాజుల పల్లి ఆర్‌ఎస్ సర్పంచ్ అస్లాం బాషా, పార్టీ మండల మధు, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, నాగపుల్లయ్య, సుబ్రమణ్యం, మల్లికార్జునరావు, మౌళీశ్వరరెడ్డి, జనార్దన్‌రెడ్డి, క్రాంతికుమార్, చిన్న రంగస్వామి, మహేష్ పాల్గొన్నారు.
ఆదుకోవాలని దివ్యాంగులరాలి వినతి
దేవస్ధానం ప్రధాన కార్యాలయం నుంచి కార్యక్రమం ముగించుకొని వెలుపలికి రాగానే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిని కలవడానికి ఓ దివ్యాంగురాలు వీలు చైర్ సైకిల్‌పై వేచి ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే యువతి దగ్గరికి సమస్యల గురించి తెలుసుకున్నారు. తాను మహానందిలో భిక్షాటన చేసుకొని జీవిస్తున్నాని దివ్యాంగురాలు చెప్పారు. సైకిల్‌పై బిక్షాటన చేయడం కష్టం ఉందని, ఎలకా్ట్రనిక్ స్కూటర్ మంజూరు చేయించాలని కోరారు. అలాగే నివాస స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బుడ్డా దివ్యాంగురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగురాలి వివరాలు సేకరించి తనకు పంపాలని టీడీపీ నాయకుడు సూరే శ్రీనివాసులుకు సూచించారు.
‘ప్రజల రుణం తీర్చుకుంటా’
నమ్మకంతో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం రాత్రి మహానంది మండలం తమ్మడపల్లి, అబ్బీపురం గ్రామాల్లో థ్యాంక్స్ ఫర్ ఓటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎంతో విసిగి పోయారన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గ్రామాల్లో కక్షలు పెంచారని, నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలు కక్షలకు దూరంగా ఉండాలని సూచించారు. త్వరలోనే మహానంది ఆలయ పాలకమండలిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వీనిరెడ్డి, టీడీపీ నాయకులు బుడ్డారెడి శ్రీనివాసరెడ్డి, శ్యామల జనార్దన్‌రెడ్డి, హరి ప్రసాదరెడ్డి, దస్తగిరి, శంకర్, అధికారులు పాల్గొన్నారు.