గోడౌన్ తనిఖీ
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:02 AM
నంద్యాల, బనగానపల్లెలో సివిల్ సప్లయుస్ గోడౌన్‌లను జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదివారం తనిఖీ చేశారు.

నంద్యాల కల్చరల్, జూన్ 16: నంద్యాల, బనగానపల్లెలో సివిల్ సప్లయుస్ గోడౌన్‌లను జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. జిల్లాలోని 10 సివిల్ గోడౌన్లను తనిఖీ చేశారు. అనంతరం జెసి రాహుల్‌కుమార్‌రెడ్డి గోడౌన్‌లను తనిఖీ చేయగా చక్కర, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లు, తక్కువ తూకాలను గమనించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్, డీఎం సివిల్ సప్లయిస్, టెక్నికల్ అసిస్టెంట్లును టీమ్‌లగా వేసి సోమవారం సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని జేసీ అధికారులను ఆదేశించారు.