Share News

జాతి గర్వించదగిన గాయకుడు ఘంటసాల

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:53 AM

తెలుగు జాతి గర్వించదగిన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కొండయ్య కొనియాడారు.

జాతి గర్వించదగిన గాయకుడు ఘంటసాల
ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేస్తున్న శీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కొండయ్య, గాయకులు

కర్నూలు కల్చరల్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): తెలుగు జాతి గర్వించదగిన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కొండయ్య కొనియాడారు. బుధవారం ఘంటసాల జయంతి సందర్భంగా నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఘంటసాల జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల చిత్ర పటానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు పాటకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఒక్క ఘంటసాలకు చెందుతుందని శ్లాఘించారు. టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి మహమ్మద్‌ మియా మాట్లాడుతూ ఘంటసాల పేరుపై రాష్ట్ర ప్రభు త్వం గాయకులకు అవార్డులు ఇవ్వాలని కోరారు. కథా రచయిత ఇనాయ తుల్లా మాట్లాడారు. కార్యక్రమంలో గాయకులు కొండయ్య, శ్రీనివాసులు, య శోద, శ్రీదేవి పాడిన ఘంటసాల పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

ఘంటసాల పాట అజరామరం

ఘంటసాల పాటలు అజరామరంగా నిలిచి ఉంటాయని, తెలుగు భాష ఉన్నంత వరకు ఘంటసాల పాట వినిపిస్తూనే ఉంటుందని పలువురు వక్తలు కొనియాడారు. ఘంటసాల 102వ జయంతి సందర్భంగా నగరంలోని పద్మశ్రీ ఘంటసాల గాన కళాసమితి ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ఆయక ర్‌ భవన కూడలిలోని ఘంటసాల విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. సమితి అధ్యక్షుడు వాసుదేవమూర్తి, ఉపాధ్యక్షుడు కేసీ కల్కూర, అనుబంధ కార్యదర్శి మధురకవి ఎలమర్తి రమణయ్య తదితరుల నిర్వహ ణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్య నిపుణు డు డబ్ల్యూ సీతారాం, డాక్టర్‌ బి.శంకరశర్మ, డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కొండయ్య తదితరులు హాజరయ్యారు వక్తలు మాట్లాడుతూ ఘంటసాల నవరసాలు అలవోలకగా పలికించే ఏకైక గాయకుడు అని కొనియాడారు.

Updated Date - Dec 05 , 2024 | 12:53 AM