14న మహానందిలో గంగాదేవి పుష్కరోత్సవం
ABN , Publish Date - May 12 , 2024 | 12:41 AM
మహానంది క్షేత్రంలో ఈనెల 14న గంగాదేవి పుష్కరోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి శనివారం తెలిపారు.

మహానంది, మే 11: మహానంది క్షేత్రంలో ఈనెల 14న గంగాదేవి పుష్కరోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి శనివారం తెలిపారు. గంగాదేవి పుట్టిన రోజున మహానందిలో పుష్కరోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు మహానందిలోని రుద్రగుండం కోనేరులో గంగాదేవి పుణ్య స్నానాలు ఆచరించినట్లు పురాణాల్లో ఉందని ఆలయ వేదపండితుడు రవిశంకర్ అవధాని తెలిపారు. భక్తులు గంగాదేవి పుష్కరోత్సవం రోజు క్షేత్రంలోని రుద్రగుండం కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులు కావాలని కోరారు.