Share News

గంగ ఒడికి గణేశుడు

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:02 AM

వినాయక చవితి సందర్భంగా విశేష పూజలందుకున్న గణేశుడు సోమవారం గంగ ఒడికి చేరాడు.

గంగ ఒడికి గణేశుడు
దేవనకొండ: నిమజ్జన వేడుకల్లో కేరళ సాంస్కృతిక కార్యక్రమాలు

కర్నూలు, ఆదోని మినహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం

శోభా యాత్రలో యువత ఉత్సాహం

కోలాహలంగా సాగిన వేడుకలు

వినాయక చవితి సందర్భంగా విశేష పూజలందుకున్న గణేశుడు సోమవారం గంగ ఒడికి చేరాడు. కర్నూలు, ఆదోని పట్టణాలు మినహా జిల్లా వ్యాప్తంగా మూడో రోజు వినాయక నిమజ్జన వేడుకలు కోలాహలంగా జరిగాయి. జై గణేశా.. జైజై గణేశా నినాదాలు, మేళతాళాలతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమం సంబరంగా సాగింది. ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం పట్టణాలతో పాటు ఓర్వకల్లు, కోడుమూరు, కల్లూరు తదితర మండలాల్లో మూడో రోజు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మండపాల నుంచి వినాయకుడిని కదిలించారు. నిమజ్జన కార్యక్రమానికి ఆటంకం లేకుండా తగిన జాగ్రత్తలతో యువత నృత్యాలు చేస్తూ కోలాటాలు వేస్తూ వినాయకుడిని గంగ ఒడికి సాగనంపారు. ఎమ్మిగనూరు పట్టణంలో భారీ వినాయక విగ్రహాలు వెళ్తుండగా శోభా యాత్ర యువతీ యువకుల ఉత్సాహం, కేరింతలతో సందడి నెలకొంది. ఆయా ప్రాంతాల్లోనీ నదులు, వంకలు, చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.

- ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం

Updated Date - Sep 10 , 2024 | 12:02 AM