Share News

టీడీపీ పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ: గౌరు చరిత

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:44 PM

సంక్షేమ పాలన తీసుకొస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారని, టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరుచరిత అన్నారు.

టీడీపీ పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ: గౌరు చరిత
ఎల్‌కే తండా గ్రామంలో గిరిజన సంప్రదాయ దుస్తుల్లో గౌరు చరిత

గడివేముల, ఏప్రిల్‌ 26: సంక్షేమ పాలన తీసుకొస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారని, టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరుచరిత అన్నారు. జగన్‌ సీఎం పీఠం ఎక్కిన తరువాత సామాన్యులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ కరువైందని అన్నారు. అన్ని వర్గాల వారు ఆర్థిక పురోగతి సాధించారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి రాక్షస పాలనకు అంతమందించాలని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరుచరిత శుక్రవారం వండుట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పావురాళ్లను ఎగురవేసి ప్రజలకు పిలుపునిచ్చారు.

వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరుచరిత అన్నారు. మండలంలోని వండుట్ల గ్రామంలో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. పంట సాగు చేసేందుకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. రిజర్వాయర్లకు మరమ్మతులు చేయలేదని అన్నారు. రైతుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి, తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరుచరిత అన్నారు. మండలంలోని ఎల్‌కే తండా, వండుట్ల, మంచాలకట్ల, గని గ్రామంలో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయని అన్నారు. వైసీపీ నాయకులు ప్రజల సంక్షేమం వదిలేసి అక్రమార్చనపైనే దృష్టి పెట్టారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్‌, బస్సు చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, మాజీ కో-ఆప్షన్‌మెంబర్‌ ఎస్‌ఏ రఫిక్‌, మాజీ జడ్పీటీసీ సీతారామిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, గని హర్ష, రాజునాయక్‌, వండుట్ల సర్పంచ్‌ గంగాధర్‌రెడ్డి, కాలిద్‌బాషా, గిరిబాబు, రంగస్వామినాయక్‌, సుబ్బన్ననాయక్‌, గణేష్‌, ఐటీడీపీ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌కే తండా గ్రామంలో గిరిజనుల సంప్రదాయ దుస్తులు ధరించి గౌరు చరిత ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ వాసులు ఆమెకు తమ సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు.

Updated Date - Apr 26 , 2024 | 11:44 PM