ఉచిత బస్సు హామీని అమలు చేయాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:20 AM
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయాలని ఏఐసీసీ మెంబర్, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ డిమాండ్ చేశారు.

నంద్యాల క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయాలని ఏఐసీసీ మెంబర్, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ డిమాండ్ చేశారు. గురు వారం నంద్యాలలోని నూనెపల్లె సెంటర్‌లో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు ప్లకార్డులు చేపట్టి నిరసన తెలిపారు. నంద్యాల నుంచి కంబలూరుకు వెళ్లే పల్లె వెలుగు బస్సులో మహిళలతో మాట్లాడుతూ పోస్ట్‌కార్డ్ ఉద్యమాన్ని చేపట్టారు. సూపర్ సిక్స్‌లో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహాలక్ష్మి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ మాజీ అధ్యక్షుడు చింతలయ్య, సేవాదళ్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, మాజీ ఉపాధ్యక్షుడు ఉసేన్‌బాషా పాల్గొన్నారు.