Share News

వైసీపీని ఇంటికి సాగనంపుదాం: గౌరు చరిత

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:07 AM

రాష్ట్రంలో సీఎం జగన్‌ విధ్వంసక పాలన కొనసాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపుదామని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత పిలుపునిచ్చారు.

వైసీపీని ఇంటికి సాగనంపుదాం: గౌరు చరిత
టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

గడివేముల, ఏప్రిల్‌ 12: రాష్ట్రంలో సీఎం జగన్‌ విధ్వంసక పాలన కొనసాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపుదామని పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత పిలుపునిచ్చారు. మండలంలోని కరిమద్దెల, పెసరవాయి, గడిగరేవుల, తిరుపాడు గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని అన్నారు. వైసీపీ నాయకులు మట్టి, మైనింగ్‌, ఇసుకను దోపిడి చేశారని అన్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను కబ్జా చేశారని అన్నారు. రైతులు పండించిన జొన్నల కొనుగోలులో వివక్షత చూపారని అన్నారు. వైసీపీ నాయకుల ధాన్యం కొనుగోలు చేసి చిన్న, సన్నకారు రైతులకు రిక్తహస్తం చూపారని అన్నారు. అలగనూరు రిజర్వాయర్‌ మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు సాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో వెలగమాను ఫీడర్‌ చానల్‌ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచెయి చూపారని అన్నారు. వైసీపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 8 సార్లు కరెంట్‌ చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్‌-6 పథకాలు అమలు చేస్తామని అన్నారు. బీసీ డిక్లరేషన్‌ అమలు చేస్తామని అన్నారు. ముస్లింలకు అండగా ఉంటామని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి, కరిమద్దెల ఈశ్వర్‌రెడ్డి, శివారెడ్డి, వడ్డు లక్ష్మీదేవి, ప్రశాంతి, శ్రీనివాసులు, కృష్ణయాదవ్‌, గిరిబాబు, సుదర్శన్‌రెడ్డి, రాజునాయక్‌, రంగస్వామినాయక్‌, ఐటీడీపీ ఇన్‌చార్జి బీవీఎన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక

గడిగరేవుల గ్రామంలో వైసీపీలో ఉన్న పరమేశ్వర్‌రెడ్డి, చిన్న బుగ్గారెడ్డి, పెద్ద బుగ్గారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, నాగభూషణంరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, లింగారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వారి అనుచరులు శుక్రవారం పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరుచరితారెడ్డి సమక్ష్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Apr 13 , 2024 | 01:07 AM