Share News

మాటలతో మభ్యపెట్టడంలో శిల్పా దిట్ట

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:17 AM

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేయడంలో దిట్ట అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి విమర్శించారు.

 మాటలతో మభ్యపెట్టడంలో శిల్పా దిట్ట
టీడీపీలో చేరిన నాయకులతో బుడ్డా

శ్రీశైలం, ఏప్రిల్‌ 13: ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేయడంలో దిట్ట అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి విమర్శించారు. శనివారం శ్రీశైల ముఖద్వారం వద్ద నుంచి బుడ్డా రాజశేఖరరెడ్డికి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికి భారీ బైక్‌ ర్యాలీగా శ్రీశైలానికి వచ్చారు. శ్రీశైలంలోని మహిషాసురమర్థిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతర శ్రీగిరి కాలనీలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. బత్తుల చిన్నగాలయ్య కుమారుడు దుర్గాప్రసాద్‌ తన అనుచర వర్గం ఐతా మార్కండేయులు, చిక్కా వెంకటేష్‌, అరవపల్లి సత్యనారాయణ, విశ్వనాథం, బోయ మురళితో పాటు సుమారు 300 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. బుడ్డా మాట్లాడుతూ అక్రమార్జనతో నియోజకవర్గ ప్రజలను విస్మరించిన శిల్పాకు ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. న్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సుస్థిర పరిపాలన అందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి శిల్పా చక్రపాణి గెలిచారన్నారు. ఆయన మాటలు నమ్మి భారీ మెజారీటీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధి, ప్రజల కనీస అవసరాలను విస్మరించి తన వ్యాపారాలతో అక్రమార్జనకు పాల్పడ్డారని బుడ్డా ఆరోపించారు. దేవస్థానంలో తన కార్తికేయ ఏజెన్సీని అడ్డం పెట్టుకుని సిబ్బందికి తక్కువ వేతనాలు ఇస్తూ ఈ ఐదేళ్లలో రూ. 60 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అదేవిధంగా వ్యాపారులపై వేలకువేలు అద్దె భారాలు మోపి ఇబ్బందులకు గురిచేశారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శిల్పా చక్రపాణిరెడ్డి సేవాసదన్‌ పేరుతో శిద్దరామప్ప కాంప్లెక్స్‌లో మూడు దుకాణాలను తీసుకుని చదరపు అడుగుకు రూ.10 చొప్పున చెల్లించడం దుర్మార్గమన్నారు. ఆ దుకాణాలను వైసీపీ కార్యాలయంగా మార్చుకుని అక్రమంగా చలామని అవుతుంటే దేవస్థానం అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. శ్రీశైలంలో పేదలకు ఇళ్లు కట్టించి తాళాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రజలు చక్రపాణిరెడ్డిని నిలదీయాలని సూచించారు. చక్రపాణిరెడ్డిలాగా నేను తప్పుడు హామీలు ఇవ్వనని బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే శ్రీశైలంలో నివసించేందుకు ఇంటి సౌకర్యాలు, రహదారులు, విద్యుత్‌ దీపాలు, ఇంటికి మీటర్లు మంజూరు చేయిస్తానని బుడ్డా రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనతో ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పార్టీ మారిన నాయకులు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. శిల్పా చక్రపాణిరెడ్డిని నిమ్మ వెంట వెళితే మోపోయామని తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టిందన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:17 AM