Share News

హోరాహోరీగా బండలాగుడు పోటీలు

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:26 AM

పట్టణ శివారులోని కొలుములపల్లె రస్తాలో వెలసిన చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలను పురస్కరిం చుకుని దేవస్థానం కమిటీ ఆధ్వర్యం లో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు శేషారెడ్డి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు.

హోరాహోరీగా బండలాగుడు పోటీలు

బేతంచెర్ల, ఏప్రిల్‌ 21: పట్టణ శివారులోని కొలుములపల్లె రస్తాలో వెలసిన చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలను పురస్కరిం చుకుని దేవస్థానం కమిటీ ఆధ్వర్యం లో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు శేషారెడ్డి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో 9 జతల ఎద్దులు పాల్గొనా.. కర్నూలు జిల్లా డి.రుద్రవరం గ్రామానికి చెందిన రాముడు కుమారుడు ఎల్లగౌడు ఎద్దులు ప్రథమ విజేతగా నిలిచి రూ.50వేల నగదును కైవసం చేసుకున్నాయి. అలాగే ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సుధాకర్‌ ఎద్దులు రెండో విజేతగా నిలిచి రూ.40వేలు, నంద్యాల మండలం ఏ-కోడూరు గ్రామానికి చెందిన సీఎన్‌ఆర్‌ బుల్స్‌ చాగంటి నాగ మల్లికార్జునరావు ఎద్దులు మూడో విజేతగా నిలిచి రూ.30వేలు గెలుచుకున్నాయి. అదేవిధంగా నాగర్‌ కర్నూలు జిల్లా లింగాల మండలం రామవరం గ్రామానికి చెందిన అక్షరరావు ఎద్దులు నిలిచి రూ.20వేలు, బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన బీరం రమాదేవి ఎద్దులు ఐదో విజేతగా నిలిచి రూ.10వేలు నగదును గెలుచుకు న్నాయి. విజేతలకు ఆలయ కమిటీ సభ్యులు, దాతలు బహుమతలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో దేవసాథనం కమిటీ సభ్యులు మల్లు సుబ్బారెడ్డి, గౌరి ఉశేన్‌రెడ్డి, మల్లిపెద్ది రఘురాంరెడ్డి, అన్నారావు, యాంకర్‌ మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:26 AM