ల్యాండ్ టైటిలింగ్‌తో పొలాలు లాక్కుంటారు
ABN , Publish Date - May 12 , 2024 | 12:42 AM
ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రాష్ట్రంలోని పొలా లను లాక్కోవడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, మే 11: ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రాష్ట్రంలోని పొలా లను లాక్కోవడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం జీవో ప్రతులను శనివారం బనగానపల్లెలో కార్యకర్తలతో కలసి టీడీపీ కార్యాలయం ఆవరణలో తగులబెట్టారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ మన భూములను ఈ చట్టం ద్వారా తాకట్టు పెడతారన్నారు. దీని ప్రకారం రిజిస్ర్టేషన్ ఒరిజినల్ పత్రాలను యజమానులకు ఇవ్వరని అన్నారు. చివరికి కోర్టుకు వెళ్లాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాలనే నియమం ఈచట్టంలో ఉందన్నారు. రైతులు, ప్రజలు ఈ చట్టానికి వ్యతిరేకం గా టీడీపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ పిలుపునిచ్చారు.