నేటి నుంచి నేత్రదాన వారోత్సవాలు
ABN , Publish Date - Aug 25 , 2024 | 12:34 AM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు.
నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 24: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట సిబ్బందితో కలిసి శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వారోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. వారోత్సవాలలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో పని చేసే సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టి లోప నివారణ అంశాలపై ప్రజల్లోకి వెళ్ళి విస్తృత ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ మాధవీలత, కార్యాలయ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.