Share News

లక్ష్యాలను అధిగమించండి

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:48 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేటాయించిన లక్ష్యాలను మించి వృద్ధి రేటు సాధించాలని కలెక్టర్‌ రాజకుమారి బ్యాంకర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు.

లక్ష్యాలను అధిగమించండి
బీమా పోస్టర్లను విడుదల చేస్తున్న కలెక్టర్‌, జేసీ, బ్యాంకు అధికారులు

నంద్యాల కల్చరల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేటాయించిన లక్ష్యాలను మించి వృద్ధి రేటు సాధించాలని కలెక్టర్‌ రాజకుమారి బ్యాంకర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రభుత్వ పథక రుణాల మంజూరుపై జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌తో కలిసి బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పఽథక రుణాల మంజూరుకు సంబంధించి అధికారులతో పాటు బ్యాంకర్లు కూడా సపోర్ట్‌ ఇచ్చి లబ్ధిదారుల అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. సామాన్య ప్రజలకు ప్రమాద బీమా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సురక్షా, పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన పఽథకాల కింద అర్హులైన ఖాతాదారులను నమోదు చేయించి స్కీం ఉపయోగాలు వివరించాల న్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:48 PM