Share News

‘మహా’వేడుకలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:51 AM

‘మహా’వేడుకలకు సర్వం సిద్ధం

‘మహా’వేడుకలకు సర్వం సిద్ధం

రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు

8న పాగాలంకరణ, కల్యాణోత్సవం

భారీగా తరలిరానున్న భక్తులు

శ్రీశైలం, ఫిబ్రవరి 28: ఇల కైలాసంగా భావించే శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ మవుతాయి. పదకొండు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లకు వివిధ సేవలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. 41 రోజుల పాటు కఠోర దీక్షను కొనసాగించిన శివస్వాములు శివరాత్రి సందర్భంగా దీక్షలను విరమిస్తారు.

ముఖ్య కార్యక్రమాలు ఇలా..

1వ తేదీ, శుక్రవారం : ధ్వజారోహణ

2వ తేదీ, శనివారం : భృంగి వాహనసేవ

3వ తేదీ, ఆదివారం : హంస వాహనసేవ

4వ తేదీ, సోమవారం : మయూర వాహనసేవ

5వ తేదీ, మంగళవారం : రావణ వాహనసేవ

6వ తేదీ, బుధవారం : పుష్ప పల్లకి

7వ తేదీ, గురువారం : గజవాహన సేవ

8వ తేదీ, శుక్రవారం : పాగాలంకరణ, కల్యాణోత్సవం

9వ తేదీ, శనివారం : రథోత్సవం, తెప్పోత్సవం

10వ తేదీ, ఆదివారం : యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ

11వ తేదీ, సోమవారం : అశ్వవాహన సేవ, శయనోత్సవం

Updated Date - Feb 29 , 2024 | 12:51 AM