Share News

ప్రతి ఒక్కరూ అమ్మపేరుతో మొక్కలు నాటండి

ABN , Publish Date - Aug 23 , 2024 | 01:14 AM

ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని కలెక్టర్‌ పి.రంజితబాషా పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ అమ్మపేరుతో మొక్కలు నాటండి
మామిడి మొక్కను నాటి నీరుపోస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ పి.రంజితబాషా

కర్నూలు(కలెక్టరేట్‌), ఆగస్టు 22: ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని కలెక్టర్‌ పి.రంజితబాషా పిలుపునిచ్చారు. గురు వారం ఉదయం అమ్మ పేరుతో మొక్క కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన తన తల్లి పేరుతో మామిడి మొక్కను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏక్‌ ఫేడ్‌ మాకే నామ్‌ అనే కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించి సెప్టెం బరు 2024 నాటికి 80 కోట్ల మొక్కలను, మార్చి 2024 నాటికి 140 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. జిల్లాలో లక్ష మొక్క లను నాటుతున్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలోనూ, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణంలోనూ ప్రతి ఒక్కరూ వారి తల్లుల పేరుపై మొక్క లను నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటిన అనంతరం సంబంధిత ఫొటోలు మేరీ లైఫ్‌ పోర్టల్‌లో అప్‌లోడు చేసేందుకు కూడా అవకాశం ఉంద న్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ అమర్నాథ్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 01:14 AM