ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:23 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రంజిత్‌బాషా జిల్లా, మండల స్థాయి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.

కలెక్టర్ పి. రంజిత్‌బాషా
కర్నూలు(కలెక్టరేట్), జూలై 8: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రంజిత్‌బాషా జిల్లా, మండల స్థాయి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సకాలంలో బియాండ్ ఎస్‌ఎల్‌ఏ లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కుష్ఠు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టండి: జిల్లాలో కుష్ఠు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించి లెఫ్రసీ కేస్ డిటక్షన్ క్యాంపెయిన్‌కు సంబంధించిన వైద్య అధికా రులతో కలెక్టర్ సమన్వయ సమీక్ష సమావేశం నిర్వి హంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై 1630 టీమ్స్ (ఆశా, వలంటీర్లు) ద్వారా జిల్లా వ్యాప్తంగా సర్వే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డీఆర్వో కే.మధుసూదన్‌రావు, జిల్లా వైద్యాధికారి డా.ప్రవీణ్ కుమార్, జిల్లా కుష్టు ఎయిడ్స్ నివారణ టీబీ అధికారి డా.భాస్కర్, జిల్లా న్యూక్లియస్ ఆఫీసర్ డా.మల్లికార్జున రెడ్డి, డీపీఎంవోలు హక్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.