విద్యుత్ చార్జీల పెంపు పాపం వైసీపీదే
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:55 PM
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు పాపం గత వైసీపీ ప్రభుత్వానిదేనని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ అన్నారు.

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజశేఖర్
కల్లూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు పాపం గత వైసీపీ ప్రభుత్వానిదేనని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని వైసీపీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈమేరకు కర్నూలు మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తంరెడ్డి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌యాదవ్‌తో కలిసి ఆయన వైసీపీ నాయకులు ర్యాలీ చేసిన ప్రాంతాన్ని శుక్రవారం పసుపునీటితో శుద్ధి చేశారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ కన్వీనర్ డి.రామాంజనేయులు, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఎస్.పిరోజ్, టీడీపీ జిల్లా కోశాధికారి పీయూ.మాధన్న, ఎన్వీ.రామకృష్ణ, సంపతి లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.