పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:54 PM
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకో వాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.

వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
వైసీపీ ఆధ్వర్యంలో కాటసాని గృహం నుంచి ర్యాలీ
కల్లూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకో వాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు శుక్రవారం కాటసాని స్వగృహం నుంచి వైసీపీ శ్రేణులు బళ్లారి చౌరస్తా మీదుగా కర్నూలు జిల్లా విద్యుత్‌శాఖ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ చార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజల నడ్డి విరిచేలా కరెంట్ చార్జీలు పెంచడం సరైందికాదన్నారు. అనంతరం విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఎం. ఉమాపతికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ మేయర్ ఎస్.రేణుక, కార్పొరేటర్లు గాజుల శ్వేతారెడ్డి, వైజా అరుణ, దండు లక్ష్మీకాంతరెడ్డి, చిట్టెమ్మ, ఇప్పల నారాయణరెడ్డి, బెల్ల మహేశ్వరరెడ్డి, కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.