Share News

ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:49 PM

రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను శాంతియు తంగా, స్వేచ్ఛగా, చట్టబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు.

ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 6: రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను శాంతియు తంగా, స్వేచ్ఛగా, చట్టబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి హింసకు, రీ పోలింగ్‌కు తావు లేకుండా పటిష్టమైన భద్రత చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, లిక్కర్‌, నగదు, ఉచితాల అక్రమ రవాణపై పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. ఇంటింటి ప్రచారానికి సంబంధించి ముందస్తు సమాచారాన్ని ఆర్వోకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ జి.సృజన, ఎస్పీ జి.కృష్ణకాంత్‌, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:49 PM