Share News

ఎన్నికల నియమావళిని పాటించాలి: ఆర్వో

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:30 AM

అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్ప నిసరిగా పాటించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మహేశ్వరరెడ్డి అన్నారు.

ఎన్నికల నియమావళిని పాటించాలి: ఆర్వో

డోన్‌(రూరల్‌), ఏప్రిల్‌ 16: అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్ప నిసరిగా పాటించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మహేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్‌ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని, పోటీ చేసే అభ్యర్థులు నాలుగు నామినేషన్ల వరకు వేసుకోవచ్చని తెలిపారు. రూ.10వేలు డిపాజిట్‌ చెల్లించాలని, షెడ్యూల్‌ కులాలు, షెడ్యుల్‌ తెగలకు రూ.5వేలు డిపాజిట్‌ ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటలలోపు వేసుకోవాలన్నారు. అభ్యర్థుల ఖర్చు రూ.40 లక్షలు మించకూడదన్నారు .నామినేషన్‌ వేసేందుకు ర్యాలీగా వస్తే.. పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి, పట్టణ సీఐ ప్రవీణ్‌ కుమార్‌, రూరల్‌ సీఐ అజ్రత్‌ భాషా, పట్టణ ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:30 AM