Share News

సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:33 AM

నంద్యాల నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిస్కరించడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి
నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల (నూనెపల్లె), జూలై 27: నంద్యాల నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిస్కరించడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శనివారం నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు రాష్ట్ర నాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ శాసనభ సమావేశాల అనంతరం నంద్యాలకు వచ్చామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విదంగా పని చేస్తామని అన్నారు.నంద్యాల అభివృద్ధే తమ లక్ష్యమని, త్వరలోనే నంద్యాలలో కాలువలు, రోడ్లు, మంచి నీటి వసతి కల్పించి సౌకర్యాలను మెరుగు పరుస్తామని చెప్పారు.

ఉమ్రా యాత్రకు బయలుదేరిన ముస్లింలు

నంద్యాల (నూనెపల్లె): నంద్యాల సాయిబాబా నగర్‌ కుబ్రా మసీదు నుంచి ఉమ్రా యాత్రకు ముస్లింలు శనివారం బయలు దేరారు. టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్‌ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో ఇమాముల సంఘం అధ్యక్షుడు అమ్జాద్‌బాషా సిద్ధికీ, మత పెద్దలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

మంత్రి ఫరూక్‌ను కలిసిన ఎస్పీ

నంద్యాల క్రైం: ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అధిరాజ్‌ సింగ్‌ రాణా శనివారం నంద్యాల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంత్రి ఫరూక్‌ను కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి, పోలీస్‌ సంక్షేమం, గంజాయి నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 12:33 AM