Share News

‘ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి’

ABN , Publish Date - May 03 , 2024 | 12:12 AM

రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరఽథరామిరెడ్డి అన్నారు.

‘ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి’
మల్యాల హంద్రీ నీవా ప్రాజెక్టును పరిశీలిస్తున్న నాయకులు

నందికొట్కూరు రూరల్‌, మే 2: రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరఽథరామిరెడ్డి అన్నారు. గురువారం నందికొట్కూరు పట్టణంలోని అల్వాల సత్యనారాయణ కళ్యాణ మండపంలో ప్రాంతీయ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నీటి ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించామని అన్నారు. మల్యాల వద్ద ఉన్న హంద్రీ నీవా ప్రాజెక్టును కూడా పరిశీలించామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు రాయలసీమ ప్రాంత సమస్యను పట్టించు కొని న్యాయం చేయాలని కోరారు. ప్రతి ఎకరాకు సాగు నీరు ఎవరు ఇస్తారో వాళ్లకే ఓటు వేయాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:12 AM