Share News

సచివాలయ సిబ్బందికి విధులు

ABN , Publish Date - May 29 , 2024 | 11:53 PM

జూన్‌ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేయనున్న కౌంటింగ్‌ సిబ్బంది చరవాణిలను భద్రపరిచే కేంద్రం వద్ద సచివాలయ సిబ్బందికి విధులు కేటాయించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. సృజన అధికారులను ఆదేశించారు.

సచివాలయ సిబ్బందికి విధులు

జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి.సృజన

కర్నూలు(కలెక్టరేట్‌), మే 29: జూన్‌ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేయనున్న కౌంటింగ్‌ సిబ్బంది చరవాణిలను భద్రపరిచే కేంద్రం వద్ద సచివాలయ సిబ్బందికి విధులు కేటాయించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం రాయలసీమ యూనివర్సిటీలో ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్‌ లైఫ్‌ సైన్స్‌, లైబ్రరీ బ్లాక్‌లను, కౌంటింగ్‌ రూములను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, ఎస్పీ జి.కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ రోజున రాయలసీమ యూనివర్సిటీకి వెళ్లేందుకు కౌంటింగ్‌ సిబ్బంది కోసం కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఉదయం 5 గంటలకు బస్సు ఏర్పాటు చేశామన్నారు. లైఫ్‌ సైన్స్‌ బ్లాక్‌లో కర్నూలు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాలు, లైబ్రరీ బ్లాక్‌లో మంత్రాలయం, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ, పార్లమెంటు కౌంటింగ్‌ హాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. వీరి వెంట పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో, నగర పాలక కమిషనర్‌ భార్గవ్‌తేజ తదితరులు ఉన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:53 PM