డుగ్గు డుగ్గు.. తుక్కు తుక్కు
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:00 AM
నగరంలో కొండారెడ్డి బురుజు జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద 110 బైక్ సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు.

కర్నూలు క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నగరంలో కొండారెడ్డి బురుజు జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద 110 బైక్ సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు. వారం రోజులుగా ట్రాఫిక్ పోలీసులు అధిక శబ్దాలు వచ్చే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 110 వాహనాల సైలెన్సర్లను తొలగించారు. వీటిని గురువారం ఉదయం జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. 80 డెసిబుల్స్ కంటే అధిక శబ్దాలు వచ్చే బైకులపై సైంటిఫిక్ పద్ధతుల్లో తనిఖీలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా కౌన్సెలింగ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు మన్సూరుద్దీన్, నాగరాజురావు, రామయ్యనాయుడు, మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.