Share News

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: డీపీవో

ABN , Publish Date - May 24 , 2024 | 12:16 AM

జిల్లాలో తాగునీటి సమస్య, వాటర్‌ ట్యాంకుల శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేయవద్దని డీపీవో మంజులవాణి సూచిం చారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: డీపీవో

రుద్రవరం, మే 23: జిల్లాలో తాగునీటి సమస్య, వాటర్‌ ట్యాంకుల శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేయవద్దని డీపీవో మంజులవాణి సూచిం చారు. గురువారం రుద్రవరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 480 పంచాయతీలు ఉన్నాయన్నారు. ఆర్‌ డబ్ల్యూఎస్‌ ఏఈ, ఈవోపీఆర్‌డీ, ఎంపీడీవో వారానికి ఒకసారి ప్రతి గ్రామా న్ని పర్యవేక్షించి అక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. తప్పు చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాల్లో కార్యదర్శులు ఆదర్శ వంతంగా పనిచేసి ఆదర్శ్రగామాలుగా తీర్చిదిద్దాలన్నారు. పదిహేనురోజుల కొసారి వాటర్‌ ట్యాంకులు కార్యదర్శులు దగ్గరుండి క్లోరినేషన్‌ చేయించి గ్రూపులో ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఇంకుడు గుంతలు టో ఫీడ్స్‌ పరిశీలించాలన్నారు. కార్యదర్శులు ప్రణాళికాబద్ధంగా అన్నిరికార్డులను సక్ర మంగా ఉంచాలన్నారు. ఎంపీడీవో రామచంద్ర, ఈవోపీఆర్డీ శ్రీనివాసశర్మ, ఏఈ ప్రమోద్‌, ఇన్‌చార్జి ఎంఈఓ కోటయ్య, హెల్త్‌ సూపర్‌వైజర్లు నాగప్ర సాద్‌, రాదయ్య, కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 12:16 AM