కర్నూలు డీఎంహెచ్‌ఓగా డాక్టర్ భాస్కర్
ABN , Publish Date - Jul 31 , 2024 | 11:51 PM
జిల్లా టీబీ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఎల్.భాస్కర్‌ను డీఎంహెచ్‌ఓ (ఎఫ్‌ఏసీ)గా నియమిస్తు బుధవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు(హాస్పిటల్), జూలై 31: జిల్లా టీబీ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఎల్.భాస్కర్‌ను డీఎంహెచ్‌ఓ (ఎఫ్‌ఏసీ)గా నియమిస్తు బుధవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓగా పని చేస్తున్న డాక్టర్ వై.ప్రవీణ్ కుమార్ బుధవారం పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్ భాస్కర్‌ను నియమించారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన భాస్కర్ తన మొదటి ఉద్యోగ ప్రస్థానాన్ని కడప జిల్లా ఖాజీపేట పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా ప్రారంభించారు. 2022లో సివిల్ సర్జన్‌గా కర్నూలు జిల్లా టీబీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. కర్నూలు టీబీ ఆఫీసర్‌గా రెండేళ్లు అడిషినల్ డీఎంహెచ్‌వోగా పని చేసిన ఆయనకు ఇప్పుడు డీఎంహెచ్‌వోగా నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాలు జారీ చేశారు.