సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Oct 29 , 2024 | 01:06 AM
అధికారుల దృష్టికి వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు.
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, అక్టోబరు 28, (ఆంధ్రజ్యోతి): అధికారుల దృష్టికి వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రివెన్స్ అడ్రసింగ్ సిస్టెమ్-పీజీఆర్‌ఎస్‌లో డివిజన్‌లోని మండలాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మండ లంలోని శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ, గడువులోపు పరిష్కరిం చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్సెల్యేలోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల సమస్యలు కొన్ని ..
ఆదోని మండలం ఽఢణాపురం గ్రామంలో సర్వే నెం. 191,191-3 పట్టా భూమిని ఆన్‌లైన్‌లో ఈ-నామ్ గా నమోదు అయిందని, విచారణ చేసి పట్టా భూములుగా నమోదు చేయాలని గ్రామానికి చెందిన హనుమేష్ అర్జీ సమర్పించుకున్నారు
ఆదోని మండలం నెట్టేకల్లు గ్రామంలో ప్రభుత్వ రోడ్డు స్థలం ఆక్రమణ చేసుకుని మరుగుదొడ్డి నిర్మాణం చేసుకు న్నారు. ప్రస్తుతం సదరు స్థలం నందు రస్తాకు సమస్య అయినది. దయతో విచారణ చేసి సమస్యను పరిష్కరించవలసిందిగా నెట్టేకల్లు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి అర్జీ సమర్పించుకున్నారు.
పెద్దకడుబూరు మండలం హెచ్ మురవణి గ్రామానికి చెందిన గడిగె బజారుకి సంబంధించి సర్వే నెం. 422-ఏ నందు 0.92 సెంట్ల భూమి, సర్వే నెం. 434 నందు 1.40 ఎకరాల మరియు, సర్వే నెం. 634-ఏ నందు 0.80 సెంట్ల భూమి మొత్తం కలిపి 3.64 ఎకరాల భూమి పెద్దల నుంచి సంక్రమించింది. సదరు భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయవలసిందిగా అర్జీ సమర్పించుకున్నారు. అలాగే ఎమ్మిగనూరు మండల గుడెకల్లు గ్రామానికి చెందిన కృష్ణయ్య గ్రామం సర్వే నెం. 219 నందు 0.14 సెంట్ల భూమి వారసత్వంగా సంక్రమించినది. సదరు భూమికి సంబంధించి సర్వే చేసి, ఆన్‌లైన్ నందు నమోదు చేసి, పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని అర్జీ సమర్పించుకున్నారు. సర్వేయర్ శ్రీనివాస రాజు, వేణుసూర్య, డీఎల్‌డీపీవో నూర్జహాన్, డీఎల్‌డీవో ప్రభాకర్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ పద్మజ, డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, హౌసింగ్ డీఈ రవికుమార్, ఆర్‌్క్షబి డిప్యూటి ఇంజనీర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.