‘యురేనియం తవ్వకాలపై ఆందోళన వద్దు’
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:46 AM
కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టులో యురేనియం తవ్వకాలను పూర్తిస్థాయిలో జరపడం లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్ సూచించారు.
దేవనకొండ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టులో యురేనియం తవ్వకాలను పూర్తిస్థాయిలో జరపడం లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్ సూచించారు. మండలంలోని కప్పట్రాళ్లలో శనివారం కౌలుట్లయ్య ఆలయం వద్ద ఆర్డీవో గ్రామస్థులతో మాట్లాడారు. యురేనియం నిల్వలు ఏ మేర ఉన్నాయో పరిశీలించడం కోసం 68 బోర్లు ఏర్పాటు చేయడానికి మాత్రమే అనుమతి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం తవ్వకాలకు అనుమతులు రాలేదని, గ్రామాలు వీడాల్సిన అవసరం లేదని అన్నారు. అనంతరం వెలమకూరు రస్తా, ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆర్డీవో వెంట ఆర్‌ఐ రెవెన్యూ అధికారులు లోకేశ్వరరావు, విజయ్‌భాస్కర్, మండల సర్వేయర్ మేఘశ్యామ్, వీఆర్వో దాదావలి, షఫీ, సూరీడు, హనుమన్న ఉన్నారు.