Share News

ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:20 AM

రెవెన్యూ సదస్సుల్లో రైతులు సమర్పించిన అర్జీలపై నిర్లక్ష్యం వహించవద్దని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు.

 ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు
మంత్రాలయం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆనలైనలో నమోదైన ఫిర్యాదులను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

మంత్రాలయం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో రైతులు సమర్పించిన అర్జీలపై నిర్లక్ష్యం వహించవద్దని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. గురువారం రాత్రి మంత్రాలయం తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులో వచ్చిన రికార్డులను, మ్యుటేషన, భూమి కొలతలు, రీసర్వే జరిగిన అవకతవకలు వంటి రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్‌ పరిధిలో ఉన్న సమస్య లను వెంటనే పరిష్కరించాలని, తమవి కానివి పరిధిలో తమకు పంపా లని అధికారులను ఆదేశించారు. గ్రామ వీఆర్వోలు, సర్వేయర్లు, ఆర్‌ఐ లు, తహసీల్దార్లు నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వచ్చిన ఫిర్యా దులను ఆనలైన చేసి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. రైతుల ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమసైన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్‌ ఎస్‌. రవి, డిప్యూటీ తహసీల్దార్లు జీకే గురురాజరావు, సరస్వతి, ఆర్‌ఐ ఆదాం, మండల సర్వేయర్‌ అశోక్‌, జయరామిరెడ్డి, వీఆర్వోలు భీమన్నగౌడు, భీముడు, శ్వేత, ప్రభాకర్‌, నరసప్ప, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:20 AM