Share News

4న జిల్లా స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:29 AM

ఉమ్మడి కర్నూలు బాల్‌బ్యాడ్మింటన్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 4వ తేదీ గుడ్‌షెపర్డ్‌ పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌ సబ్‌ జూనియర్స్‌ బాల బాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ చైర్మన్‌ చిన్నపు రెడ్డి కార్యదర్శి మద్దిలేటి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

4న జిల్లా స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు

నంద్యాల (నూనెపల్లె), జూలై 27: ఉమ్మడి కర్నూలు బాల్‌బ్యాడ్మింటన్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 4వ తేదీ గుడ్‌షెపర్డ్‌ పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌ సబ్‌ జూనియర్స్‌ బాల బాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ చైర్మన్‌ చిన్నపు రెడ్డి కార్యదర్శి మద్దిలేటి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు 2-1-2009 తర్వాత పుట్టిన వారై ఉండాలని తెలిపారు. ఉదయం 8 గంటలలోపు హాజరు కావాలని పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వారి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు. రూ.100 ప్రవేశ రుసుం చెల్లించాలన్నారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేసి, ఎంపికైన జట్లు సెప్టెంబరు 13 నుంచి 15 వరకు తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో జరిగే ఏపీ అంతర్‌ జిల్లాల చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:29 AM