Share News

నేడు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:46 PM

జిల్లాలోని ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా వెల్లడించారు.

నేడు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

కర్నూలు(కలెక్టరేట్‌), జూలై 31: జిల్లాలోని ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా వెల్లడించారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గత నెలలో కొన్ని మండలాల్లో ఉదయం 11, 12 గంటలకు కూడా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. ఈసారి అలాంటి పొరపాట్లు జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకే పించన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సలీంబాషా, ఎల్డీఎం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:46 PM