కార్డుదారులకు రాగిపిండి పంపిణీ : జేసీ
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:55 AM
జిల్లాలో శుక్రవారం నుంచి కార్డుదారులకు రూ.11లకే కిలో రాగిపిండి పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు.
కర్నూలు(కలెక్టరేట్), ఫిబ్రవరి 29: జిల్లాలో శుక్రవారం నుంచి కార్డుదారులకు రూ.11లకే కిలో రాగిపిండి పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశంలో జేసీ మౌర్య మాట్లా డుతూ శుక్రవారం నుంచి కార్డుదారులకు రూ.11 కేజీ రాగి పిండిని ఎండీయూ వాహనం ద్వారా పంపిణీ చేస్తామ న్నారు. మార్కెట్‌లో కేజీ రాగిపిండి ధర దాదాపు రూ.40లు ఉందన్నారు. సివిల్ సప్లయ్ డీఎం షర్మిళ, డీఎస్‌వో కేవీఎస్‌ఎం ప్రసాద్ పాల్గొన్నారు.