Share News

కాంపాక్ట్‌ వాహనం డ్రైవర్‌ తొలగింపు

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:37 AM

ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ఉల్లంఘించిన కాంపాక్ట్‌ (చెత్త సేకరణ) వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్న జి. రాజేష్‌ను విధుల నుంచి తొలగిస్తూ శనివారం కర్నూలు అసెంబ్లీ నియోజికవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగర పాలక కమిషనర్‌ భార్గవ్‌ తేజ ఉత్తర్వులు జారీ చేశారు.

కాంపాక్ట్‌ వాహనం డ్రైవర్‌ తొలగింపు

కర్నూలు(కల్చరల్‌), మార్చి 23: ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ఉల్లంఘించిన కాంపాక్ట్‌ (చెత్త సేకరణ) వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్న జి. రాజేష్‌ను విధుల నుంచి తొలగిస్తూ శనివారం కర్నూలు అసెంబ్లీ నియోజికవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగర పాలక కమిషనర్‌ భార్గవ్‌ తేజ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు నగర పాలక సంస్థలోని 14వ శానిటరీ డివిజన్‌ పరిధిలో ఆప్కాస్‌ ద్వారా నియమితుడై కాంపాక్ట్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న రాజేష్‌ శుక్రవారం రోజు సాయిబాబా సంజీ వనగర్‌లో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఫిర్యాదు వచ్చింది. అతనిపై విచారణ నిర్వహించి రుజువు కావడంతో విధుల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 12:37 AM