పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:21 AM
తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో భూపాల నగర్‌కు చెందిన సుమంజలి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.

కర్నూలు, జనవరి 11: తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో భూపాల నగర్‌కు చెందిన సుమంజలి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. సుమంజలి భర్త గత పదిహేను రోజుల కింద మృతి చెందాడు. ఈమె కూలీ పని చేస్తూ జీవిస్తోంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా తన ఇద్దరూ పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు, చుట్టుపక్కల అంతా గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.