Share News

కూలీలకు వజ్రాలు లభ్యం

ABN , Publish Date - May 26 , 2024 | 11:35 PM

పొలం పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలకు విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి.

కూలీలకు వజ్రాలు లభ్యం

రూ.7 లక్షలు, ఐదు తులాల బంగారు ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారి

తుగ్గలి, మే 26: పొలం పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలకు విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. ఆదివారం మండల పరిధిలోని జొన్నగిరిలో పొలం పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలకు వేర్వేర ప్రాంతాల్లో రెండు వజ్రాలు లభించాయి. వాటిని స్థానిక వజ్రాల వ్యాపారస్థులకు ఒక వజ్రాన్ని విక్రయించారు. సదరు వ్యాపారి రూ.6లక్షలతో పాటు ఐదు తులాల బంగారు నగలను ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా మరో వజ్రాన్ని రూ.లక్షకు కొనుగోలు చేశాడు. తొలకరి జల్లులు కురిసినప్పుడు ఈ ప్రాంతంలో విరివిగా వజ్రాలు లభ్యం అవుతూ ఉంటాయి. అందుకోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కూలీలకు రెండు వజ్రాలు లభించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Updated Date - May 26 , 2024 | 11:35 PM