Share News

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:14 AM

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు.

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు
శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల రద్దీ

మంత్రాలయం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఆది, సోమవారం అమావాస్య దినం కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగాణం భక్తులతో కిక్కిరిసింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొన్న మఠం అధికారులు క్యూలైన్లు, పరిమళ ప్రసాదం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రమణీయం ప్రహ్లాదరాయల వెండి రథోత్సవం: రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శ నం ఇచ్చారు. సోమవారం ధనుర్మాసం అమావాస్యను పురస్కరిం చుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో అర్చకులు బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణబోధపూజ మంది రంలో ఉత్సవమూర్తికి పాదపూజ చేసి పల్లకిలో ఊరేగించారు. అనంత రం వెండి రథంపై ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాం గణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు.

Updated Date - Dec 31 , 2024 | 01:14 AM