అభివృద్ధి మార్గదర్శకుడు చంద్రబాబు
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:53 PM
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే మార్గదర్శకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ పేర్కొన్నారు.

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్
ఓర్వకల్లు, జూన్ 12: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే మార్గదర్శకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ పేర్కొన్నారు. బుధవారం ఓర్వకల్లు మండలంలోని హుశేనాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా ఎల్‌ఈడీ స్కీన్లను ఏర్పాటు చేశారు. కళాకారులు పాడిన ఎన్టీఆర్ పాటలు, టీడీపీ గీతాలు హోరెత్తించాయి. మల్లెల రాజశేఖర్, ఆయన సతీమణి మల్లెల జ్యోతిలు కేక్ కట్ చేశారు. అనంతరం మల్లెల రాజశేఖర్ దంపతులను, మండల సమాక్య గౌరవ సలహాదారు విజయభారతి మల్లెల దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాల్వబుగ్గ మాజీ చైర్మన్ చంద్రపెద్ద స్వామి, ముస్లీం మైనార్టీ నాయకుడు మహబూబ్‌బాషా, కాపు సంఘం నాయకులు కేవీ మధు, టీడీపీ తెలుగు యువత మండల అధ్యక్షుడు రాము, మండల కన్వీనర్ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.